Jump to content

విధి పాండ్య

వికీపీడియా నుండి
విధి పాండ్య
2021లో విధి పాండ్య
జననం (1996-06-07) 1996 జూన్ 7 (వయసు 28)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఉడాన్ (2014 టీవీ సిరీస్)
ఏక్ దుజే కే వాస్తే 2
బిగ్ బాస్ హిందీ సీజన్ 15
మోస్ ఛల్ కియే జాయే

విధి పాండ్యా (జననం 1996 జూన్ 7) హిందీ టెలివిజన్‌ రంగానికి చెందిన భారతీయ నటి. 2014లో కిరణ్ మెహ్రా పాత్ర పోషించిన తుమ్ ఐసే హి రెహ్నాతో ఆమె తొలిసారిగా నటించింది. ఇది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో 2014 నవంబరు 10న ప్రారంభమై 2015 ఏప్రిల్ 10న ముగిసింది. ఉడాన్‌లో ఇమ్లీ సింగ్ రాజ్‌వంశీ, ఏక్ దూజే కే వాస్తే 2లో సుమన్ తివారీ మల్హోత్రా, మోస్ ఛల్ కియే జాయేలో సౌమ్య వర్మ పాత్రలో విధి పాండ్యా బాగా పేరు పొందింది.[1] వీటితో పాటు క్రైమ్ పెట్రోల్ కూడా ఆమె కరీర్ కి కలిసివచ్చింది.

సోప్ ఒపెరా ఉడాన్ మహేష్ భట్ నిర్మించగా కలర్స్ టీవీ 2014 ప్రసారం చేసింది.[2] రొమాంటిక్ టెలివిజన్ సిరీస్ ఏక్ దుజే కే వాస్తే 2 సోనీలివ్‌లో ప్రసారం చేయబడింది.[3] ఇక మరో రొమాన్స్ థ్రిల్లర్ టెలివిజన్ సీరియల్ మోస్ ఛల్ కియే జాయే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో 2022 ఫిబ్రవరి 7 నుండి 2022 ఆగస్టు 5 ల మధ్య ప్రసారమవ్వగా సోనీలివ్‌లో డిజిటల్‌గా ప్రసారం చేయబడింది.[4]

కెరీర్

[మార్చు]

2014లో కిరణ్ మహేశ్వరి పాత్రలో తుమ్ ఐసే హి రెహ్నాతో విధి పాండ్యా కెరీర్ మొదలైంది. ఆమె ఆ తర్వాత 2015 నుండి 2016 వరకు బాలికా వధులో నిధి పాత్రను పోషించింది. 2015లో, క్రైమ్ పెట్రోల్ వివిధ ఎపిసోడ్‌లలో ఆమె రోహిణి సింగ్ / సోఫియా పాత్రను పోషించింది.[5]

2016 నుండి 2019 వరకు, ఆమె ఉడాన్‌లో పరాస్ అరోరా[6], వికాస్ భల్లా సరసన ఇమ్లీ సింగ్ రాజ్‌వంశీ పాత్రను పోషించింది, ఇది ఆమె కెరీర్‌లో ప్రధాన మలుపుగా నిరూపించబడింది.[7]

ఆమె తర్వాత 2019లో కిచెన్ ఛాంపియన్ ఎపిసోడ్‌లో కనిపించింది. అదే సంవత్సరం, ఆమె లాల్ ఇష్క్ ఎపిసోడ్‌లో రాణి పాత్రలో సహీమ్ ఖాన్, మెహనాజ్ ష్రాఫ్‌లతో కలిసి నటించింది.[8]

ఆమె 2021లో మోహిత్ కుమార్ సరసన ఏక్ దుజే కే వాస్తే 2లో మేజర్ డాక్టర్ సుమన్ తివారీ మల్హోత్రా పాత్రను పోషించింది.[9] అక్టోబరు 2021లో, ఆమె బిగ్ బాస్ 15లో పాల్గొంది. అయితే, ఆయె 18వ రోజున హౌస్‌మేట్స్ ద్వారా తొలగించబడింది.[10]

2022లో, ఆమె విజయేంద్ర కుమేరియా సరసన మోస్ ఛల్ కియే జాయేలో సౌమ్య వర్మ పాత్రను పోషించింది.[11]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్ప్ మూలాలు
2013 ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ ఆయేషా
2014 తుమ్ ఐసే హాయ్ రెహనా కిరణ్ మహేశ్వరి
2015–2016 బాలికా వధూ నిధి
2015 క్రైమ్ పెట్రోల్ రోహిణి సింగ్ / సోఫియా
2016–2019 ఉడాన్ ఇమ్లీ సింగ్ రాజవంశీ
2019 కిచెన్ ఛాంపియన్ ఆమెనే అతిథి పాత్ర
లాల్ ఇష్క్ రాణి ఎపిసోడ్: "ఇచ్ఛాధారి మెంధక్"
2021 ఏక్ దుజే కే వాస్తే 2 మేజర్ డా. సుమన్ తివారీ మల్హోత్రా
బిగ్ బాస్ 15 పోటీదారు 23వ స్థానం
2022 మోసే ఛల్ కియే జాయే సౌమ్య వర్మ / సౌమ్య అర్మాన్ ఒబెరాయ్ [12]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పురస్కారం కేటగిరి ధారావాహిక/సినిమా ఫలితం మూలాలు
2017 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి (ఫిమేల్) పాపులర్‌ నామినేట్ చేయబడింది.
2019 గోల్డెన్ పెటల్ అవార్డులు ఉత్తమ సహాయ నటి విజేత
2022 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ప్రముఖ నటి (నాటకం) మోసే ఛల్ కియే జాయే పెండింగ్‌లో ఉంది [13]

వివాదం

[మార్చు]

2018లో, విధి పాండ్య ఒక వివాదంలో చిక్కుకుంది, ఆమె ఉడాన్ దర్శకుడు పవన్ కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు దావానలంలా వ్యాపించాయి. పుకార్ల కారణంగా అతను ఉద్యోగం కోల్పోయాడని సమాచారం. అయితే, ఆమె ప్రస్తుతం అలాంటివి ఏమీ లేవని ప్రకటించింది.[14]

మూలాలు

[మార్చు]
  1. "Vidhi rocks the street look - Udaan's Imli, Vidhi Pandya is unrecognizable in these pictures, see it for yourself - The Times of India". The Times of India. 30 January 2018. Retrieved 31 March 2018.
  2. Anil Wanvari (12 August 2014). "Colors to awaken rural masses with 'Udaan' – Indian Television Dot Com". Retrieved 15 September 2014.
  3. "Ek Duje Ke Vaaste- 2". Mid Day. 10 February 2020.
  4. Bharatvarsh, TV9 (2022-04-24). "Mose Chhal Kiye Jaaye : अरमान और सौम्या की जिंदगी में आएगा बड़ा तूफान, जल्द ही शो में होगी एक्ट्रेस अवंतिका हुंदल की एंट्री". TV9 Bharatvarsh (in హిందీ). Retrieved 2022-04-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Exclusive! Tum Aise Hi Rehna: Kinkshuk Mahajan and Shefali Sharma in lead roles". Times Of India.
  6. "Conceptualised 'Udaan' actually for a film Mahesh Bhatt". mid-day. 14 August 2014. Retrieved 15 September 2014.
  7. "5 TV serials that broke stereotypes and educated India - Times of India". The Times of India.
  8. "Udaan completes 1000 episodes; entire cast attends the success party". India Today. Retrieved 20 March 2018.
  9. Bureau, ABP News (17 December 2020). "Kanika Kapur QUITS 'Ek Duje Ke Vaaste 2', 'Udaan' Fame Vidhi Pandya To REPLACE Her". ABP Live (in ఇంగ్లీష్). Retrieved 2020-12-20.
  10. "Salman Khan's Bigg Boss 15 to premiere on October 2. Watch new promo". India Today. 19 September 2021.
  11. "Vijayendra Kumeria talks about Mose Chhal Kiye Jaaye going off air; "If we'd stuck to original concept instead of foraying into ultra-feminism, it would have better numbers," said the actor". Bollywood Hungama. Retrieved 2022-07-13.
  12. Bharatvarsh, TV9 (2022-04-27). "Mose Chhal Kiye Jaaye Spoiler : सौम्या ने अपने सास को दी आत्मनिर्भर होने की प्रेरणा, जानिए क्या हैं विधि पंड्या का कहना". TV9 Bharatvarsh (in హిందీ). Retrieved 2022-04-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  13. "22nd Indian Television Academy Awards Nominations - Vote Now". Indian Television Academy Awards. Retrieved 9 September 2022.
  14. "Vidhi Pandya: Bigg Boss 15 Contestant Vidhi Pandya Wiki, Career, Instagram Photos and Videos". web.archive.org. 2024-02-21. Archived from the original on 2024-02-21. Retrieved 2024-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)