1926
Appearance
1926 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1923 1924 1925 - 1926 - 1927 1928 1929 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 4: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
- జనవరి 14: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (మ.2010)
- జనవరి 14: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (మ.2016)
- జనవరి 23: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)
- జనవరి 29: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
- మార్చి 11: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018)
- మే 1: ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన భారతీయ సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2022)
- మే 12: భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త (మ.2015).
- మే 14: నూతి విశ్వామిత్ర, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- మే 16: మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1996)
- జూన్ 1: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
- జూన్ 1: గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (మ. 2000)
- జూలై 1: తూమాటి దోణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)
- జూలై 9: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
- జూలై 10: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- ఆగస్టు 7: అన్నవరపు రామస్వామి, వాయులీన విద్వాంసులు.
- ఆగస్టు 11: ఎక్కిరాల కృష్ణమాచార్య, ఆధ్యాత్మిక వేత్త (మ.1984).
- ఆగస్టు 25: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010)
- ఆగష్టు 29: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
- సెప్టెంబరు 5: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014)
- సెప్టెంబరు 13: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006)
- సెప్టెంబర్ 23: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు.
- అక్టోబరు 2: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993)
- అక్టోబరు 3: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010)
- అక్టోబరు 15: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (మ.1984)
- అక్టోబరు 21: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (మ.2019)
- నవంబరు 13: ఎ.ఆర్.కృష్ణ, ఆధునిక తెలుగు నాటకానికి ఆద్యుడు. (మ.1992)
- నవంబరు 23: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)
- నవంబరు 25: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)
- డిసెంబరు 21: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007)
- డిసెంబరు 31: ఎస్.జడ్. ఖాసిమ్ భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల విజేత.