1802
స్వరూపం
1802 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1799 1800 1801 - 1802 - 1803 1804 1805 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 10: భారతదేశంలో గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే మొదలైంది
- మే 20: ఫ్రెంచి విప్లవ సమయంలో రద్దు చేసిన బానిసత్వాన్ని నెపోలియన్ తిరిగి ప్రవేశపెట్టాడు.
- మే: మేడం టస్సాడ్ తన మైనపు బొమ్మలను లండన్‌లో తొలిసారి ప్రదర్శించింది.
- జూలై 22: గియా లాంగ్ హనోయిని ఆక్రమించాడు. దాంతో వియత్నాం ఏకీకరణ పూర్తైంది.
- తేదీ తెలియదు: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడయ్యాడు
- తేదీ తెలియదు: నూజివీడు ఎస్టేటును నిడదవోలు, నూజివీడు అనే రెండు ఎస్టేట్లుగా విభజించారు.
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 26: విక్టర్ హ్యూగో, సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885)
- జూలై 24: అలెగ్జాండర్ ద్యూమా ఫ్రెంచి రచయిత (మ. 1870)
- తేదీ తెలియదు: చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి, గుంటూరు జిల్లాకు చెందిన వాగ్గేయకారుడు. ఈయనకు చిరుమామిళ్ళ సుబ్బదాసు అని కూడా పేరు. (మ. 1882)
- తేదీ తెలియదు: దార్ల సుందరీమణి (దార్ల సుందరమ్మ) తెలుగు రచయిత్రి, గురువు, తత్త్వజ్ఞాని, యోగిని.