Jump to content

భార్యాభర్తలు

వికీపీడియా నుండి
భార్యాభర్తలు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణ కుమారి,
[jayanti]
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

భార్యాభర్తలు 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం.[1] ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ఈ సినిమాని తమిళ భాషలో నున్న నవలా పెంన్మానం ఆధారంగా చిత్రీకరించారు. అదేవిదంగా ఇదే కధాంశంతో 1963లో ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో శివాజీ గణేశన్, బి సరోజ దేవి ప్రధాన పాత్రగా చిత్రీకరించారు. ఈ సినిమాకి ఎస్. రాజేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు

ఇందులో శారదా ( కృష్ణ కుమారి ) ఉపాధ్యాయురాలు. వీరి తండ్రి న్యాయవాది శివ కమయ్య ( రమణ రెడ్డి ). తన జీవితం సాగుతున్న క్రమంలో ఆనంద్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. ఈ క్రమంలో శారదా కుటుంబ సభ్యులు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తనకి నచ్చలేదు. కాల క్రమేణా ఆనంద్ వ్యక్తిత్వవాన్ని మెచ్చి తనతో ప్రేమలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఆనంద్ పూర్వపు ప్రేమికురాలు హేమలత ( గిరిజ ) మరల తరసా పడి తనను మళ్ళి పెళ్లి చేసుకోవాలని హెచ్చరిస్తుంది. ఆనంద్ ను తన ఇంటికి రావాలని భయపెడుతుంది. ఆనంద్ తన ఇంటికి చేరుకున్న క్రమంలో హేమలత ( గిరిజ ) ను తన భర్త తనను చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆనంద్ అతన్ని అడ్డుకొని తనని కాపాడుతాడు. ఈ గొడవ సాగుతున్న క్రమంలో ఆంజనేయులు తప్పు ను ఒప్పుకుంటాడు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
నటీనటులు పోషించిన పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు ఆనంద్
కృష్ణకుమారి శారద
రేలంగి వెంకట్రామయ్య లాయరు రామానందం
గుమ్మడి వెంకటేశ్వరరావు ధర్మారావు, ఆనంద్ తండ్రి
బి. పద్మనాభం ఆంజనేయులు
గిరిజ హేమలత
సూర్యకాంతం తాయారు, లాయరు భార్య
హేమలత
రమణారెడ్డి శివకామయ్య, శారద తండ్రి
చదలవాడ కుటుంబరావు కుటుంబయ్య
నిర్మలమ్మ మాణిక్యమ్మ, ఆనంద్ తల్లి
సంధ్య కనకం, శారద తల్లి
జయంతి
బొడ్డపాటి

సాంకేతిక బృందం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఓ సుకుమార నను జేర రావోయి... ఇటు రావోయి శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
జోజోజోజోజోజో చూచి, చూచి, కళ్ళు కాయలే కాచాయి కొసరాజు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల జిక్కి
జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిహాయిగా తీయతీయగా శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
ఏమని పాడెదనో ఈ వేళ, మానసవీణ మౌనముగా నిదురించిన వేళా శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల

కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట , రచన:కొసరాజు , గానం.మాధవపెద్ది , స్వర్ణలత

నిలువగలేని వలపుల రాణి నీకొరకే తపించునులే , రచన: శ్రీ శ్రీ , గానం.ఘంటసాల , పి.సుశీల

విరటుని రాణి వాసమున వెల్గేడి భారతశక్తి (పద్యం) రచన: శ్రీ శ్రీ , గానం.పి.సుశీల .

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ముళ్లపూడి, వెంకటరమణ (2011). భార్యాభర్తలు వెండితెర నవల. హైదరాబాద్: హాసం ప్రచురణలు.
  2. "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 డిసెంబరు 2016. Retrieved 8 September 2011.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.