Jump to content

కొడవటిగంటి రోహిణీప్రసాద్

వికీపీడియా నుండి
కొడవటిగంటి రోహిణీప్రసాద్
కొడవటిగంటి రోహిణీప్రసాద్
జననంకొడవటిగంటి రోహిణీప్రసాద్
సెప్టెంబర్ 14, 1949
తెనాలి
మరణంసెప్టెంబరు 8, 2012
ముంబై
ఇతర పేర్లుకొడవటిగంటి రోహిణీప్రసాద్
తండ్రికొడవటిగంటి కుటుంబరావు
తల్లివరూధిని

కొడవటిగంటి రోహిణీప్రసాద్ (సెప్టెంబర్ 14, 1949 - సెప్టెంబరు 8, 2012) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత,హేతువాది [1]. 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధిని లకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

సంగీతం తన నాలుగో ఏట వినికిడి మీద తనంతట తానుగా నేర్చుకోవటం మొదలుపెట్టి, హిందుస్తానీ, కర్ణాటక సంగీతంలో క్రమంగా మంచి ప్రావీణ్యం సంపాదించాడు.సర్వశ్రీ పండిట్ ఎల్.ఆర్.కేల్కర్ (గ్వాలియర్ ఘరానా), ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (సితార్) వద్ద శిష్యరికం చేసి సితార్ వాయిద్య నైపుణ్యం సంపాదించి తన పదహారో ఏట "అరంగ్రేటం" చేసారు.

1978లో ఆయన నేపథ్య సంగీతం సమకూర్చి, బాంబేలో ప్రదర్శించిన "కుమార సంభవం" అనే నృత్య నాటిక పెద్దలందరిచేత మన్ననలు పొందింది.అలాగే ఆయన 2003లో కూచిపూడి కళా కేంద్రం వారి నృత్యరూపకం "కృష్ణ పారిజాతం" లోని "తులాభారం" అంకానికి స్వరపరిచిన సంగీతం అందరినీ అలరించింది. సెప్టెంబరు 8, 2012ముంబైలో మరణించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రోహిణి ప్రసాద్ కొడవటిగంటి కుటుంబ రావు, వరూధినిలకు జన్మించారు. ఇతని మేనమామ కొమ్మూరి సాంబశివ రావు తెలుగు రచయిత. రోహిణి ప్రసాద్ రేడియో యాక్టివిటీ పరికరాలపై పరిశోధన మీద బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందాడు. తరువాత అక్కడే 30 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందాడు. తర్వాత అమెరికాలోని అట్లాంటాలో కన్సల్టెంట్‌గా పనిచేశారు . అతను ECIL లో కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు . రోహిణీప్రసాద్‌ ఎన్నో పద్యాలు పాటలు రాశారు. వాటికి రాగాలు కట్టారు. నృత్యరూపకాల్ని రూపొందించారు., మధుమేహానికి సంబంధించిన సమస్యల కారణంగా ముంబైలో 2012 సెప్టెంబర్ 8 న మరణించాడు, డాక్టర్ కొడవటిగంటి రోహిణి ప్రసాద్ శరీరాన్ని ఆయన కోరిక మేరకు వైద్య అధ్యయనం ఇంకా పరిశోధన కోసం మెడికల్ కాలేజ్ కి కుటుంబ సభ్యులు దానం చేస్తారు[2].

రచనలు

[మార్చు]

కొడవటిగంటి ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు., ఇతర విషయాలపై పుస్తకాలు రాశారు. అతను అనేక ఆన్‌లైన్ మ్యాగజైన్‌లలో కూడా వ్రాసాడు. కొన్ని రచనలు

మనుషులు చేసిన దేవుళ్ళు, సంగీతం రీతులు - లోతులు, అణువుల శక్తి, జీవశాస్త్ర విజ్ఞానం వంటి రచనలు ఉన్నాయి, పరమాణు భౌతికశాస్త్రంలో 70 పరిశోధనా పత్రాలు, జీవశాస్త్రం భౌతిక శాస్త్రం భౌతికవాదంలో మరో 300 వ్యాసాలు రాశాడు [3]

సంగీతం

[మార్చు]

రోహిణి ప్రసాద్ ముఖ్య వ్యాపకాలలో సంగీతం కూడా ఒకటి ఆయన ముంబాయిలో ఉన్నప్పుడు ఉస్తాద్‌ ఇమ్రత్‌ఖాన్‌ శిష్యరికం చేసి సితార్‌ వాదనంలో ప్రావీణ్యం గడించారు. ముంబాయిలో అక్కడి తెలుగువారితో కలిసి కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, ఒడిస్సీ, నృత్యాలు కలగలిపి ''కృష్ణా పారిజాతం'' బ్యాలేకు రూపకల్పన చేశారు[4]., ఇతను హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ మాత్రమే కాకుండా, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు రచించే వాడు, భారతదేశంలో, అమెరికాలో సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. చేసేవాడు, కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన వంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.

బయటి లింకులు

[మార్చు]



మూలాలు

[మార్చు]
  1. "కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
  2. "Dr. Rohiniprasad's Body for Medical Research - TeluguPeople.com News". www.telugupeople.com. Retrieved 2021-08-23.
  3. "ఈమాట". eemaata.com. Retrieved 2021-08-23.
  4. https://www.navatelangana.com/article/net-vyaasam/633745