కార్ల్ లిన్నేయస్
స్వరూపం
(Carl Linnaeus నుండి దారిమార్పు చెందింది)
కార్ల్ లిన్నేయస్ (కార్ల్ వాన్ లిన్నె) | |
---|---|
జననం | article note:[1]) Råshult, Älmhult, స్వీడన్ | 1707 మే 13 (see
మరణం | 1778 జనవరి 10 ఉప్సల, స్వీడన్ | (వయసు 70)
నివాసం | స్వీడన్ |
జాతీయత | స్వీడన్ |
రంగములు | జంతు, వృక్ష శాస్త్రాలు, వైద్యం |
చదువుకున్న సంస్థలు | ఉప్సల విశ్వవిద్యాలయం హార్డెవిక్ విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | వర్గీకరణ శాస్త్రం పర్యావరణం వృక్ష శాస్త్రం |
Author abbreviation (botany) | L. |
గమనికలు Linnaeus adopted the name Carl von Linné after his 1761 ennoblement awarded him the title von. ఇతడు జూనియర్ కరోలస్ లిన్నేయస్ కి తండ్రి. |
కరోలస్ లిన్నేయస్ లేదా కార్ల్ లిన్నేయస్ (మే 23, 1707 – జనవరి 10, 1778) స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.[2] ఇతడు ఆధునిక ద్వినామ నామకరణానికి నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు.
లిన్నేయస్ దక్షిణ స్వీడన్ లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో నెదర్లాండ్ లో పేరొందిన సిస్టమా నాచురే మొదటిసారి ప్రచురించాడు. స్వీడన్ తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని మొక్కలు జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా గ్రంథాలు రచించాడు. ఆ కాలంలో ఐరోపా ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ “Carl Linnaeus was born in Råshult, Småland, in 1707 on May 13th (Old Style) or 23rd according to our present calendar.” Citation: Linnaeus the child by Uppsala University. "Old Style" in the cited text refers to the Swedish calendar.
- ↑ Stafleu, F.A. (1976-1998) Taxonomic Literature second edition. An authoritative work on the names of botanists, their works and publication data, issued under the auspices of the IAPT.
వర్గాలు:
- AC with 20 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1707 జననాలు
- 1778 మరణాలు
- స్వీడన్ జీవ శాస్త్రవేత్తలు
- వైద్యులు