Jump to content

హృదయావరణం

వికీపీడియా నుండి
హృదయావరణం
Posterior wall of the pericardial sac, showing the lines of reflection of the serous pericardium on the great vessels.
A transverse section of the thorax, showing the contents of the middle and the posterior mediastinum. The pleural and pericardial cavities are exaggerated since normally there is no space between parietal and visceral pleura and between pericardium and heart Paricardium is also known as cariac epidemis.
గ్రే'స్ subject #137 524
ధమని pericardiacophrenic artery
MeSH Pericardium

హృదయావరణం (Pericardium) సకశేరుకాలలో గుండెను, ముఖ్యమైన రక్తనాళాల ఆధారభాగాలను ఆవరించి ఉండే త్రికోణాకార సంచి. ఇది సీలోమ్ నుంచి విడివడి ఏర్పడుతుంది. దీని లోపల రెండు హృదయావరణ త్వచాలు (Pericardiac membranes) గల సీరస్ పొర ఉంటుంది. లోపలి పొర గుండెను ఆనుకొని, బయటి పొర తంతుయుత త్వచాన్ని ఆనుకొని ఉంటాయి. రెండు సరస త్వచాల మధ్య హృదయావరణ ద్రవం (Pericardial fluid) ఉంటుంది. ఈ ద్రవం గుండె పని చేసేటప్పుడు అదురు, రాపిడి ఉత్పన్నం కాకుండా చూస్తుంది.

హృదయావరణ ద్రవం

[మార్చు]

హృదయావరణ ద్రవం గుండె చుట్టూ కప్పబడి ఉండే హృదయావరణ త్వచం అనే సీరస్ పొర నుండి తయారౌతుంది. సాధారణంగా ఇది ఇంచుమించు 15 నుండి 50 మి.లీ. ఉంటుంది. దీని మూలంగా గుండె చలనం సాఫీగా సాగుతుంది.

ఈ ద్రవం ఎక్కువగా తయారైనప్పుడు దానిని pericardial effusion అంటారు. ఇవి తక్కువ పరిమాణంలో, మెల్లగా అయితే ఫరవాలేదు. కానీ చాలా ఎక్కువగా ఉండినా, తొందరగా చేరినా గుండె వైఫల్యం అనే ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.

మూలాలు

[మార్చు]