Jump to content

సరళహరాత్మక చలనం

వికీపీడియా నుండి

మనం మన నిత్యజీవితం లో ఈ డోలాయమాన చలనాన్ని చూస్తుంటాము.కొన్ని ఉదాహరణలను చూద్దాము.

స్ప్రింగ్ సరళ హరాత్మక చలనమును చూపించుట
సరళ హరాత్మక చలనమును మనము ఈ విధంగా గ్రాఫికల్ చుంపించువచ్చును.
  • గోడ గడియారానికి ఉండే లోలకం చేసే చలనం.[1]
  • చేతి గడియారంలో ఉన్న సంతులన చక్రం చేసే చలనం
  • గిటారు, వయోలిన్ వంటి సంగీత వాయిద్యాలు, తీగలు చేసే చలనం.
  • ధ్వని గాలిలో ప్రయాణం చేసేటప్పుడు అణువులు చేసే చలనం
  • ఘన పదార్దాలలోని పరమాణువులు చేసే చలనం

ఒక వస్తువు ఒకసారి డోలనం చేయడాన్ని పట్టిన కాలం(డోలనావర్తన కాలం అంటారు) స్థిరంగా ఉంటుంది.ఇలాంటి చలనాన్ని ఆవర్తన చలనం అంటారు.

ఆవర్తన చలనం

[మార్చు]

సమాన కాల వ్యవధిలో ఒకే పథాన్ని పునఃశ్చరించే ఏ చలనాన్ని అయినా అవర్తన చలనం అంటారు.

కంపన చలనం

[మార్చు]

ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు, ముందుకి, వెనుకకు ఒకే పథంలో చలిస్తూ ఉంటే దాని చలనాన్ని డోలయామాన చలనం లేదా కంపన చలనం అంటారు.

సరళ హరాత్మక చలనం

[మార్చు]

ఒక వస్తువు స్థిర బిందువులో వుంటూ దాని త్వరణం దాని స్థానభ్రంశానికి అనులోనుమానుపాతం లోనూ, విరామస్థానం వైపుగా ఉండేటట్లుగా, ముందుకి-వెనకకి ఉంటే, ఆ వస్తువు సరళ హరాత్మక చలనం (స.హ.చ) చేస్తుంది అంటాం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. భౌతిక రసాయనశాస్త్ర పదవ తరగతి పుస్తకం (2010)

బాహ్యలింకులు

[మార్చు]