వర్ణపు ఉల్లంఘనం
దృశా శాస్త్రంలో క్రోమేటిక్ అబెరేషన్ (వర్ణపు ఉల్లంఘనం) అనేది కటకం నుండి వక్రీభవనం చెందిన అన్ని రంగుల కాంతి కిరణాలన్నీ నాభి పై కేంద్రీకరించబడకపోవడం. [1][2] ఇది కాంతి విక్షేపణం వలన జరుగుతుంది. ఇందులో కటకంలోని పదార్థాల వక్రీభవన గుణకం కాంతి తరంగ దైర్ఘం తో మారుతుండడం వలన ఈ దృగ్విషయం జరుగుతుంది. [3] కటకంయొక్క నాభ్యంతరం దాని వక్రీభవన గుణకంపై ఆధారపడి ఉన్నందున వక్రీభవన గుణకంలోని మార్పులు రంగులు నాభిపై కేంద్రీకరించడంపై ప్రభావం చూపిస్తాయి.[4]
ఛాయాచిత్రకళలో వర్ణపు ఉల్లంఘనం (ఆంగ్లం: Chromatic aberration లేదా achromatism లేదా chromatic distoration) అనగా ఒక కటకం అన్ని రంగులను ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలా చెయ్యటంలో విఫలమవ్వటం. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలు గల కాంతికి (అనగా వేర్వేరు రంగులకి) కటకాల యొక్క వక్రీకరణ గుణకముల (Refractive index) లో తేడాల వలన ఈ వైఫల్యం ఏర్పడుతుంది.
దృశ్యమాన వర్ణపటంలోని ఒక్కొక్క రంగు ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం కాలేకపోవటం మూలాన ప్రతిబింబంలోని కాంతివంతమైన, చీకటిమయమైన భాగాలని వేరు చేసే సన్నని గీత పొడవునా వర్ణపు ఉల్లంఘనం చారలుగా ఏర్పడుతుంది. కటక నాభి f వక్రీకరణ గుణకం పై ఆధారపడి ఉండటంతో వివిధ రంగులు వేర్వేరు చోట్ల ప్రసరిస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ Marimont, D. H.; Wandell, B. A. (1994). "Matching color images: The effects of axial chromatic aberration" (PDF). Journal of the Optical Society of America A. 11 (12): 3113. Bibcode:1994JOSAA..11.3113M. doi:10.1364/JOSAA.11.003113. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-08-28.
- ↑ "Secondary spectrum and spherochromatism". telescope-optics.net. Retrieved 2024-06-06.
- ↑ Thibos, L. N.; Bradley, A; Still, D. L.; Zhang, X; Howarth, P. A. (1990). "Theory and measurement of ocular chromatic aberration". Vision Research. 30 (1): 33–49. doi:10.1016/0042-6989(90)90126-6. PMID 2321365. S2CID 11345463.
- ↑ Kruger, P. B.; Mathews, S; Aggarwala, K. R.; Sanchez, N (1993). "Chromatic aberration and ocular focus: Fincham revisited". Vision Research. 33 (10): 1397–411. doi:10.1016/0042-6989(93)90046-Y. PMID 8333161. S2CID 32381745.